Header Banner

ఏపీ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌లో కీలక మార్పులు! జాబితాలో 2 లక్షల మంది తొలగింపుకు సిద్ధం!

  Tue Feb 04, 2025 13:40        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఈ స్కీమ్ కింద దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం నెల నెలా ఆర్థిక సాయం చేస్తోంది. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, మత్య్సకారులు ఇలా చాలా మంది పెన్షన్ ప్రయోజనాలు పొందుతున్నారు. ఐతే.. ఇటీవల ప్రభుత్వం అనర్హుల పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా భారీగా పేర్లను తొలగించింది. ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్దిదారుల సంఖ్యను 63,59,907గా చెప్పింది. ఫిబ్రవరి 3 వరకూ.. 62,43,436 మంది పెన్షన్ పొందారు. ఇంకా 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదు. ఇక వారికి పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు 98.17 శాతం మందికి పెన్షన్స్ ఇచ్చేశారు.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


ఇందుకోసం వారు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో ఇంటింటికీ వెళ్లారు. ఇక వారికి ఇలా తిరిగేందుకు టైమ్ ఉండదు. కాబట్టి.. ఇప్పుడు పెన్షన్ రానివారు.. ఓసారి సచివాలయ ఉద్యోగులకు కాల్ చేసి.. పెన్షన్ వచ్చేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ప్రతీ నెలా దాదాపు 60 వేల మంది దాకా పెన్షన్ పొందట్లేదు. అందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. లబ్దిదారులు చనిపోవడం, ఊళ్లో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఐతే.. డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు.. అనర్హులకు పెన్షన్ ఇవ్వొద్దని చెప్పినప్పటి నుంచి.. ప్రతి నెలా దాదాపు లక్ష మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. జనవరిలో దాదాపు 92 వేల మందికి పెన్షన్ ఇవ్వలేదు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అలాగే.. మరో 18,036 మంది పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఫిబ్రవరిలో 1,16,471 మందికి పెన్షన్ రాలేదంటే.. ఇక వారికి దాదాపు రానట్లే అనకోవాలి. ఈ లెక్కలను గమనిస్తే.. ప్రభుత్వం నుంచి నెలకు లక్ష మందికి పైగా పెన్షన్ పొందట్లేదు. పేర్ల తొలగింపు కూడా జరుగుతోంది. సీఎం చంద్రబాబు.. డిసెంబర్ 31, 2025 నాటికి పెన్షన్లలో అన్ని రకాల అనర్హుల పేర్లనూ తొలగించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆ ప్రకారమే పనులు జరుగుతున్నాయి. ప్రతి రోజూ లబ్దిదారుల వెరిఫికేషన్ జరుగుతోంది. అనర్హుల పేర్లను కలెక్టర్లు తొలగిస్తూ.. ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. ఇలా.. ఫిబ్రవరి, మార్చి 31 నాటికి మరో 2 లక్షల మంది పెన్షన్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapraavsi #pension #scheme #NTRbarosa #todaynews #updates #todaynews #flashnews #latestupdate